మచిలీపట్నం గ్రామీణం, 12 September
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవనంలో సర్పంచుల ఫోరం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి సీతక్కకు ఫోరం ప్రతినిధులు ఘనంగా సన్మానం చేశారు.
సీతక్కను కలిసిన సర్పంచుల ఫోరం ప్రతినిధులు. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక భీంగల్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సర్పంచుల ఫోరం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి సీతక్కను ఫోరం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్రంలోని సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యలు, నిధులు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లాలోని పలువురు సర్పంచులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలానికి చెందిన ఫోరం అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి జన్ము జనార్ధన్, ఉపాధ్యక్షుడు బేల్దారి నవీన్‌తో జిల్లా ఫోరం అధ్యక్షుడు మునుపెల్లి సాయి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సర్పంచుల సమస్యలపై వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.










