సమీక్ష (భారత్ స్పెక్ట్రమ్) సెప్టెంబర్ 11
సిరికొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచులు, ముఖ్యంగా మహిళా సర్పంచులు గైర్హాజరయ్యారు. కేవలం ముగ్గురు మహిళా సర్పంచులు మాత్రమే హాజరైన ఈ సమావేశంలో ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వైద్యం వంటి అంశాలపై ించారు.
మండల సర్వసభ్య సమావేశం కు సర్పంచుల దూరం.. మహిళా సర్పంచులు ముగ్గురే హాజరు సిరికొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మహ్మద్ రఫీ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రత్యేక అధికారి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీఓ తారాచంద్, డా. అరవింద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలో 30 గ్రామాలు, 30 మంది సర్పంచులు ఉండగా పలువురు సర్పంచులు సమావేశానికి హాజరుకాలేదు. ముఖ్యంగా మహిళా సర్పంచుల హాజరు పరిమితంగా ఉండగా ముగ్గురు మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించాల్సిన సమావేశానికి సర్పంచుల హాజరు పూర్తిస్థాయిలో లేకపోవడం కనిపించింది. ఉపాధి హామీ పనులపై మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల పురోగతిని ించారు. పనులకు హాజరవుతున్న కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై పరిశీలన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా నిర్వహించారు. మంజూరైన ఇళ్లలో పూర్తయినవి, నిర్మాణ దశలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల వివరాలను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యంపై .. డెంగ్యూపై అప్రమత్తత డా. అరవింద్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. టీబీపై అప్రమత్తంగా ఉండాలని, బీపీ, షుగర్ వంటి సమస్యల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో నీరు నిలిచే గుంతలను గుర్తించి నీటి నిల్వలను తొలగించాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు నిల్వ నీటి ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో రఫీ అహ్మద్ సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో ప్రత్యేక అధికారి ప్రకాష్, ఎంపీడీవో మహ్మద్ రఫీ అహ్మద్, ఎంపీఓ తారాచంద్, డా. అరవింద్, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, హాజరైన సర్పంచులు పాల్గొన్నారు.

