నిజామాబాద్, 12 September
బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్ల రెన్యువల్ పనుల కోసం సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అందజేశారు.
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్ల ప్రతిపాదనలు. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక బాల్కొండ. బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్ల రెన్యువల్ పనులకు సంబంధించి సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, దెబ్బతిన్న రహదారులకు రెన్యువల్ పనులు చేపట్టాలని మంత్రిని కోరారు. ముఖ్యంగా రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘాట్ల వద్ద మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ కోరారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపాదిత పనులను పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన పనులకు మంజూరు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు సునీల్ కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు పెండింగ్ పనుల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.










