ముషీర్నగర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు, తండాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను వారు గుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3,146 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయని నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సుమారు 3 వేల మంది సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా ప్రజాప్రతినిధులుగా అవకాశం పొందారని తెలిపారు.
తండాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదా కల్పించడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో స్థానిక పాలనకు మరింత బలం చేకూరిందని అన్నారు. అలాగే, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయంగా, సామాజికంగా గిరిజన వర్గాలకు ప్రాతినిధ్యం పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని నాయకులు పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకుంటారని వారు అన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దుమల శుభాష్, పీపావత్ రాజు నాయక్, దుంపల సాయిలు, నాయకపోడ్ నిత్యానందు, బట్టు పాపాసింగ్, బట్టు లక్ష్మణ్, బట్టు బలిరామ్, బట్టు కైలాష్, దేవుడు, సుధీర్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











