పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 లో జిల్లాకు 26 పతకాలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4.
పతకాలు సాధించిన పోలీసులను అభినందించిన ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ. 

తెలంగాణ రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 కరీంనగర్ లో నిర్వహించారు. పోలీస్ మీట్ లో బాసర జోన్-2 తరపున నిజామాబాద్ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ రంగాలలో 61 మంది క్రీడాకారులు పాల్గొని 26పతకాలు సాధించారు. క్రీడాకారులను నిజామాబాద్ ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి అడిషనల్ డీసీపీ (ఏ ఆర్) కె. రామ్ చందర్రావు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు హెచ్. సతీష్ (అడ్మిన్) యు. తిరుపతి (ఎంటిఓ) కే. శ్రీనివాస్ (వెల్ఫేర్), శేఖర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!