పోలీసు సేవలు మరువలేనివి కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణత్యాగం వెనకట్టలేనిది

విధి నిర్వహణలో త్యాగం చేసిన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్న ప్రజా ప్రభుత్వం,

దొంగ రియాజ్ ను పట్టుకోడానికి సహకరించిన ఆసిఫ్ కు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వాలని డీజీపీని కోరిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.

పోలీస్ అమరవీరుల ప్రతి కుటుంబానికి రూరల్ నియోజకవర్గంలో 200 గజాలు స్థలం ఇప్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్: రేకులపల్లి భూపతి రెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21 : పోలీసు అంటే సమాజంకి ఒక నమ్మకం,భరోసా,విధి నిర్వహణలో ఒక్కసారి ప్రాణాలు సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చిన వెనుకడుగు వేయరని, నెత్తురు చిందిస్తున్న మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులుఎందరో ఉన్నారని, విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్: రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్: రేకులపల్లి భూపతి మాట్లాడుతూ పోలీసు సేవలు మరువలేనివని అన్నారు. గత మూడు రోజుల కిందట సిసిఎఫ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ప్రాణాలకు తెగించి రియాజ్ అనే దొంగను పట్టుకోవడంతో రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ పై దాడి చేసి చంపడం జరిగిందని ప్రమోద్ కుమార్ ప్రాణాలు తెగించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని బాధాకరమన్నారు . పోలీస్ శాఖ అప్రమత్తమై 48 గంటల్లో దొంగ రియాజ్ ను పట్టుకోవడం జరిగిందని అన్నారు. దొంగను పట్టుకోడానికి సహకరించి ఆసిఫ్ కు తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. పోలీస్ శాఖలో హోంగార్డుగా ఆసిఫ్ కు ఉద్యోగం ఇవ్వాలని డిజిపి శివధర్ రెడ్డి కి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కోరారు. ఈ విషయంపై డిజిపి శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించి హోంగార్డ్ ఉద్యోగాం ఇస్తామని హామీ ఇచ్చారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి వివరణ వరకు లాస్ట్ పే డ్రాన్ వేతనంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని అన్నారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేశామని, అందులో భాగంగా పోలీస్ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచి రేవులలో “యంగ్ ఇండియా పోలీసులు స్కూల్” ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. పడకల్, కోరట్ పల్లి గ్రామాల్లో జరిగిన మావోయిస్టు ఎన్కౌంటర్ లల్లో అమరవీరులైన పోలీసు కుటుంబాలకు, వివిధ విధి నిర్వహణలో అమరులైన 19 పోలీస్ కుటుంబాలకు 200 గజాల స్థలం కావాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్: రేకుల పల్లి భూపతి రెడ్డి గారికి కోరడంతో, సానుకూలంగా స్పందించి, నిజామా బాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్: రేకులపల్లి భూపతిరెడ్డి ఇందల్వాయి టోల్ గేట్ సమీపంలో అమరవీరులైన పోలీస్ కుటుంబాలకు భూమిని కేటాయించడం జరిగింది, మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర డీజిపీ శివధర్ రెడ్డి సమక్షంలో స్థల పట్టాలను అందజేయడం జరిగింది. అమరుల పోలీస్ కుటుంబాలకు స్థల పట్టాలు అందజేస్తూ, గిఫ్ట్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ ఇంటలిజెన్స్ విజయ్ కుమార్, ఐజి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిజామాబాద్ సిపి సాయి చైతన్య, కుటుంబాలు, పోలీస్ సిబ్బంది తదితరులు. పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment