నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 26 : బుధవారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ పరిధి ,గుండారం గ్రామంలో బహిరంగ ప్రదేశంలో నిజామాబాద్ కు చెందిన ముగ్గురు ఆటోడ్రైవర్లు గుజ్జులువర్ నరసిములు, మహమ్మద్ రఫీఖ్, మరియు మహమ్మద్ మినాజ్, మూడు ముక్కల పేకాట (జూదం) ఆడుతూ నిజామాబాద్ రూరల్ పోలీసు లకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి పోలీసులు రూపాయలు 3430 నగదు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిజామాబాద్ రూరల్ సి ఐ సిహెచ్ శ్రీనివాస్ తెలంగాణ గేమింగ్ చట్టం, క్రింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారనీ తెలిపారు.









