కందకుర్తి గోదావరి బ్రిడ్జి ను  పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

రానున్న రెండు లేదా మూడు రోజులు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండగలరు.

ప్రజలు ఎలాంటి అవసరానికైనా సంబంధిత పోలీసు వారిని సంప్రదించగలరు.

నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 26: నేడు బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జి ని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్.పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా కందకుర్తి లో గల ఎగువన నిజాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ మరియు విష్ణుపురి నాందేడ్ జిల్లా నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జి పై నుండి నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తున్న సందర్భంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ రానున్న రెండు , మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్ , బోధన్ రూరల్ సీఐ  విజయ్ బాబు , స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్  ఎస్. సంతోష్ రెడ్డి , రెంజల్ SI  కె. చంద్ర మోహన్ , రెంజల్ MRO  శ్రవణ్ కుమార్ తదితరులు గలరు. 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment