తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూన్:1 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.భద్రతా చర్యల్లో భాగంగా చేపడుతున్న బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య  ఐ.పి.ఎస్. ఆదివారం సాయంత్రం పర్యవేక్షించారు. ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పుర ప్రముఖులు హాజరు కానున్న దృష్ట్యా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్)  బస్వా రెడ్డి, అదనపు డిసిపి (ఏఆర్)  కె. రామచంద్రరావు , నిజామాబాద్ టౌన్ ఏసిపి  రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి  మస్తాన్ అలీ, నార్త్ ఎమ్మార్వో  విజయకాంతరావు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , టౌన్ 1 SHO  రఘుపతి , రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ తిరుపతి, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!