నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 6
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో కొందరు వాహనదారులు ఎలాంటి అనుమతులు లేకుండా, మరియు అర్హతలు లేకున్నా వారి యొక్క వాహనాలకు “సైరన్లు” సైలెన్సర్ లు బిగించి వాహనాలు నడుపుతూ సాధారణ ప్రజా జీవనానికి భంగం కలిగించు చున్నారని తెలిసినది. కావున ఇలాంటి వారికి మరియు అన్ని ప్రైవేటు వాహనదారులకు తెలియజేస్తూ ఎవరు కూడా “సైరన్లు” సైలెన్సర్లు బిగించి వాహనాలను నడపరాదు, అలా నడిపిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడును మరియు అట్టి వాహనాలను జప్తు { సీజ్ ) చేయబడుననీ పోలీస్ కమిషనర్ తెలిపారు.