పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన  పోలీస్ కమీషనర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 

జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని పరీక్షలు జరుగుతున్న ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ ల పరీక్ష కేంద్రాలు సందర్శించి పరీక్షా సరళి పరిశీలించారు.పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ -2023 అమలులో ఉంటుందని, అన్ని పరీక్ష కేంద్రాలవద్ద ఎలాంటి అవంచనియా సంఘటనలు జరుగకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించాలి అని పోలీసు అధికారులను ఆదేశించారు.విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, ఎవ్వరూ కూడా అవకతవకలకు పాల్పడవద్దని ప్రతీ ఒక్కరు కష్టపడి చదివి టైమ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులు నిర్నిత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు అన్నారు. అలాగే స్పార్ట్ వాల్వేషన్ జరుగుతున్న నిర్మల హృదయ స్కూల్ సందర్శించి పరిశీలించారు ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ మరియు బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!