నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య IPS ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో మెండోరా పోలీస్ స్టేషన్ పరిధి సావెల్ గ్రామంలో ప్రజలకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు గురించి చక్కని నాటిక,పాటలతో అవగాహన కల్పించారు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు తమ ప్రాణాలను సైతంలెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రపంచమంతా నిద్రపోతున్నా తాను మాత్రమే మేల్కొని డ్యూటీ చేసేది ఒక్క పోలీసు మాత్రమే. కుటుంబాన్ని, పండగలు పబ్బాలను సైతం త్యాగించి… ప్రజల కోసం పనిచేసే రక్షక భటుల సేవలు అనిర్వచనీయం. ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వస్తుందని తెలిసినా వెనుకడుగు వేయని ధీరులు. ప్రజల రక్షణ కోసం పనిచేస్తూ విధి నిర్వహణలో ఎందరో అమరులైన సంఘటనలు ఉన్నాయి,యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. వాహనదారులు హెల్మెట్ ధరించాలి- హెల్మెట్ బరువు కాదు బాధ్యత. జీవించు జివించనివ్వు-రోడ్డు భద్రత నియమాలు పాటించు.మహిళల భద్రత కోసం రక్షణగా నిజామాబాద్ షీ టీమ్ రక్షణ కల్పిస్తుంది.నిజామాబాద్ She Team Number 8712659795 లేదా Dial 100 కి ఫోన్ చేయగలరు.మొబైల్ ఫోన్ దొంగిలించిన, పోగొట్టుకున్న CEIR పోర్టల్ ద్వారా ఫోన్ రికవరి చేయడం జరుగుతుంది.అత్యవసరసమయంలో డయల్ 100 ఉపయోగించండి.మూడ నమ్మకాలు నమ్మవద్దు – మంత్ర తంత్రాలు పారద్రోలాలి.ప్రతి గ్రామంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలి, సీసీ కెమెరాలు వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుంది, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం.ఆన్లైన్ మోసాలు గురించి అప్రమత్తంగా ఉండాలని వివరించారు,దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930చేయగలరు .గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి.నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు మాయమాటలు, లేనిపోని ఆశలు, అత్యశలు చూపించి మోసం చేస్తున్నారు, కావున ప్రజలు జాగ్రత్తగా ఉండండి.అందరూ శాంతియుతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలి. సమాజంలో జరుగతున్న నేరాలు, చట్టాల పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెండోరా పోలీస్ స్టేషన్ SI కుమారి. సుహాసిని కళాబృందం సభ్యులు మరియు బ్యాండ్ టీమ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












