ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి–సి పి సాయి చైతన్య

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : గ్రామపంచాయతీ ఎన్నికలు రెండవ విడత నిర్వహణలో భాగంగా నిజామాబాదు డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండవ విడత ఎన్నికలు నిజామాబాదు డివిజన్ పరిదిలో జరగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు.ప్రధానంగా నిజామాబాదు డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన మరియు అతిసమస్యత్మకమైనటువంటి పోలింగ్ స్టేషను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం , గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు.ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు (VPO)ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేసారు.ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించి నటువంటి పోలింగ్ బూతు యందు సక్రమమైన విధులు నిర్వహించాలని , ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యేవరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా నిజామాబాదు ఏ.సి.పి వెంకట్ రామ్ రెడ్డి ,నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నిజామాబాద్ నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ , డిచ్పల్లి సీఐ వినోద్, ధర్పల్లి సిఐ బిక్షపతి, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్, డిచ్పల్లి ఎస్సై ఆరీఫ్ , జక్రంపల్లి ఎస్సై మహేష్, ఇందల్వాయి ఎస్సై సందీప్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, సిరికొండ ఎస్సై రామకృష్ణ, ధర్పల్లి ఎస్సై కళ్యాణి, ముగ్పాల్ ఎస్సై సుస్మిత తదితరులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment