ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : (నవీన్ కుమార్) సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వేస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్, నాన్ గేవ్ కేసులలో ఇన్వేస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతీకేసులలో క్వాలిటీ ఇన్వేస్టిగేషన్ లో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జీషీటు వరకు ప్రతివిషయాన్ని కూలంకుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అని అన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖాలు చేయాలి అన్నారు. ప్రతీ అధికారికి సి.సి.టి.ఎన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. ఇన్వేస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంటు తెలిసి ఉండాలన్నారు.దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కొత్త కేసు లతో పాటు చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వలన కేసుల సంఖ్య తగ్గించే విధంగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వరన్యాయం లా చేసే కృషి చేయాలని అన్నారు. గ్రామ పోలీస్ అధికారులు (వి.పి.ఓ) ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకంమవుతు నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సి.సి కెమెరాల ప్రాముఖ్యత అవగాహణ కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్ డయల్ 100 వాటి వినియోగం పై విద్యార్థులకు ప్రజలకు అవగాహణ కల్పించాలని అన్నారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లయితే 1930 కాల్ చేసి లేదా ఎన్.సి.ఆర్.పి https://www.cybercrime.gov.యందు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు.హైవే రోడ్డులను కలుపుతుఉండే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధంగా చూడాలని అన్నారు.రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటి ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాలనివారణకు కృషి చేయాలని అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతీ రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి, ఓవర్ స్పీడ్, త్రిబల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలునడుపుటలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబం ధనల గురించి అవగాహణ కల్పించాలని అన్నారు.విజిబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణ క్రయవిక్రయాల పైన, జూదం, పి.డి.యస్. రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిపిటెడుగా ఇలాంటి నేరాలకు పాల్పడేవారి పై పీడీ యాక్టు కోసం పంపాలని ఆదేశాలు జరిచేశారు. ఈ సమీక్షా సమావేశంలో బోధన్ ఎ.సి.పి పి.శ్రీనివాస్, బోధన్ ఎస్.హెచ్.ఓ వి.వెంకట్ నారాయణ, సి.ఐ రుద్రూర్ కృష్ణ, ఎస్.ఐ లు మచ్చేందేర్ (బోధన్ రూరల్), రమ (ఎడపల్లి), చంద్ర మోహన్ (రెంజల్), సునీల్ (కోటగిరి), సాయన్న (రుద్రూర్) ఎ.ఎస్.ఐ రామరాజు (వర్ని), సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ రమేష్ (ఇన్చార్జి) తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
Published On: November 21, 2025 10:07 pm









