రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్ ల బిల్లులు చెల్లించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12.

చందూరి హన్మాండ్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాలల్లో చేపట్టిన పనుల బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచ్ లు అప్పుల పాలు అయినారు గత ఐదు సంవత్సరాల కాలంలో సర్పంచులు SDF, CDF,NREGS ద్వారా నూతన గ్రామపంచాయతీ బిల్డింగులు, పల్లె ప్రగతి పేరిట ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, ట్రాక్టర్ EMI లు, గ్రామపంచాయతీలో పనిచేసే వర్కర్ల జీతాలు, స్మశాన వాటిక( వైకుంఠధామం ), CC రోడ్లు, డ్రైనేజీ, తెలంగాణ క్రీడా ప్రాంగణం,కోతుల ఆహారశాల, కుల సంఘాల భవనాలు, డంపింగ్ యార్డ్ లు, ఇవ్వని పనులు చేశారు గత ప్రభుత్వం పేపర్ల మీద ప్రొసీడింగు లు ఇచ్చి పనులు చేయించారు ఏదైనా గ్రామపంచాయతీలో పనులు ప్రారంభించక పోతే కలెక్టర్ల ద్వారా నోటీసులు ఇప్పించారు దీనిని దృష్టిలో పెట్టుకొని సర్పంచులందరూ గ్రామాల అభివృద్ధి కొరకు తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, సొంత భూములను తాకట్టు పెట్టి పనులు చేయించారు సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో తాకట్టు పెట్టిన బంగారంనీ, భూములను ఆమ్ముకున్నారు కలెక్టర్ ధ్వరా నోటీసు ఇప్పిచి మరి పనులు చేపిన ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం బాధాకరం దిక్కుతోచని స్థితిలో సర్పంచులు పదవి కాలం ముగిసిన వీడుదల కానీ బిల్లులు సొంత డబ్బులతో పనులు చేయించిన సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం గతంలో 90% మంది సర్పంచులు BRS పార్టీ కి సంబంధించిన వారు ఉండడం వారికి బిల్లులు ఇవ్వకపోవడం అంటే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికే చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వం తొందరగా విడుదల చేయకపోతే మాజీ సర్పంచులకు ఆత్మహత్య శరణమని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!