నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19
నగరంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి..భారత్ మాతాకీ జై.. నినాదాలు మార్మోగాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో త్రివిధ దళాలకు సంఘీభావంగా సోమవారం సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో ప్రారంభమైన ర్యాలీ పెద్ద బజార్, ఆజామ్ రోడ్, నెహ్రూ పార్క్ మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగింది. చిన్నారులు.. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.దేశభక్తి పాటలతో కోలాటలాడుతూ ఆకట్టుకున్నారు. దారి పొడవున 50 మీటర్ల భారీ త్రివర్ణ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో సిటిజన్ ఫోరం కన్వీనర్ కృపాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచార, స్వచ్ఛంద సంస్థలు, అడ్వకేట్లు, యువజన, కుల సంఘాలు, క్రీడాకారులు పాల్గొన్నారు.ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, దినేష్ కులాచారి, కృపాకర్రెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం ప్రతినిధులు భారీ జాతీయ పతాకాన్ని ఊరేగిస్తున్న నగరవాసులు భరతమాత, సైనికుల వేషధారణలో విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు..