నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ .ఇట్టి క్రీడలు మంగళవారం నాడు సాయంత్రం సమయంలో జిల్లా పాత కలెక్టరేట్ గ్రౌండ్ యందు నిర్వహించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, స్నేహభావం , నలుగురిలో ఎలా మెలగాలో క్రీడలు నేర్పుతాయని అన్నారు. స్వతహాగా నేను బాక్సింగ్ క్రీడాకారుడుని నా కాలేజ్ చదివేటప్పుడు మూడు సంవత్సరాలు బాక్సింగ్ లో తర్ఫీదు తీసుకున్నానని తెలియజేశారు. నా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో బాక్సింగ్ కు సంబంధించిన ప్రశ్నలు నాకు ఎంతో సహాయం చేశాయని గుర్తు చేసుకున్నారు. బాక్సింగ్ కోచ్ శంషాముద్దీన్ ను అంతర్జాతీయ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత ఉషాముద్దీన్ ను శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించారు.అనంతరం ఇట్టి బాక్సింగ్ క్రీడలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ సుమన్ శేఖర్ కార్యదర్శి, అర్జున అవార్డ్ విన్నర్ హుస్సాముద్దీన్… జిల్లా బాక్సింగ్ కోచ్ శంశం వుద్దిన్… జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నరసయ్య రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించండి పోలీస్ కమీషనర్ వెల్లడి
Published On: June 10, 2025 11:17 pm
