నిజామాబాద్ జై భారత్ జూన్:1 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 10.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతకుముందు వినాయకనగర్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ముఖ్య అతిథితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలలో లోటుపాట్లకు తావులేకుండా, పరేడ్ మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ప్రభుత్వం అట్టహాసంగా ఈ వేడుకలను చేపడుతున్న నేపథ్యంలో మరింత విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్
Published On: June 1, 2025 8:50 pm
