నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18.
నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీటీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. నగరంలో ఎన్టీఆర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి టీటీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు యాదగౌడ్ ఆధ్వర్యంలో పూల మాల వేసి నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠించి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేశారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు కొనియాడారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు యాదగౌడ్, వేముల నాగేశ్వర్ రావు, షేక్ అజీజ్ , రషీద బేగం, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.