నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :22
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్, మంగళవారం రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి.వి.ఎన్. భరతలక్ష్మి ని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ న్యాయమూర్తి కి పువ్వుల మొక్కను బహుకరిస్తూ తమ గౌరవాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి పోలీస్ కమిషనర్‌ను ఆత్మీయంగా స్వాగతిస్తూ, అభినందనలు తెలిపారు.