నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-20
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్,. నిజామాబాదులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కచ్చియా మసీదులో సాయంత్రం ఇఫ్తార్ విందు లో పాల్గొనడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తో పాటు నిజామాబాద్ ఏ.సీ.పి రాజ వెంకట్ రామ్ రెడ్డి , మరియు వన్ టౌన్ ఎస్. హెచ్. ఓ మరియు మత పెద్దలు అయినా యూనిస్ సాబ్ , యాసీన్ సాబ్ , సిద్దిక్ సాబ్, ఇస్మాయిల్ సాబ్ , ఇద్రీస్ బాయ్ , షకీల్ పాషా తదితరులు పాల్గొనడం జరిగింది.