నిజామాబాద్ జై భారత్ జూన్ 11 : నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రా వాగు వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిటైర్డ్ ఎస్ఐ కుమారుడే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యా ను సవాల్‌గా తీసుకున్న పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి తమ మార్క్ చూయించారు.మృతుడు ఆర్యనగర్‌కు చెందిన వసంతరావుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వసంతరావు రాత్రి పాంగ్రా శివారులోని కల్లు బట్టిలో మద్యం సేవించడానికి వచ్చాడు. అదే సమయంలో రిటైర్డ్ ఎస్ఐ కొడుకు కూడా అక్కడే మద్యం సేవిస్తున్నాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం ఘర్షణగా మారింది. మద్యం మత్తులో అదుపు తప్పిన నిందితుడు వసంతరావుపై దాడికి పాల్పడ్డాడు.వసంతరావు తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడనే అనుమానంతో నిందితుడు అతన్ని వెంబడించి, పక్కనే ఉన్న బండరాయితో వసంతరావు తలపై, ముఖంపై దాడి చేసి అక్కడినుండి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన వసంతరావు ఘటన స్థలంలోనే మరణించాడు.సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రస్తుతానికి నిందితుడిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పాంగ్రా పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. హత్యకు సంబంధించిన పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నది.
నిజామాబాద్ హత్య కలకలం. – రిటైర్డ్ ఎస్ఐ కొడుకు నిందితుడు.
Published On: June 11, 2025 10:53 pm
