నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 29 : (షేక్ గౌస్) తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారిపై రాత్రి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో జమాత్ ఎ ఇస్లామీ హింద్ యాకూత్‌పురా యూనిట్ ఎం.పి.జే సహకారంతో గురువారం అర్ధరాత్రి సహాయ కార్యక్రమం చేపట్టి మానవతా విలువలను చాటింది.హైవేపై ఇరుక్కుపోయిన డ్రైవర్లు, ప్రయాణికులకు పండ్లు, బిస్కెట్లు, స్నాక్స్, నీటి బాటిళ్లు వంటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన ప్రయాణికులకూ ఈ సహాయం అందించారు.ఈ సేవా కార్యక్రమంలో జమాత్ ఎ ఇస్లామీ యాకూత్‌పురా దాయి షేక్ హుసైన్, ఎం.పి.జే అధ్యక్షుడు మహమ్మద్ జహీరుద్దీన్, జమాత్ సభ్యుడు ఇష్టియాక్, ఎం.పి.జే కార్యకర్త సయ్యద్ రఫీక్ అహ్మద్ లు ఒక బృందంగా పాల్గొని సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు.స్థానికులు, ప్రయాణికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ “కష్టకాలంలో చూపిన ఈ సహకార భావన నిజంగా ప్రశంసనీయమైనది” అని అభిప్రాయపడ్డారు.
నిజామాబాద్–కామారెడ్డి హైవేపై … జమాత్ ఎ ఇస్లామీ , ఎం.పి.జే అర్ధరాత్రి సహాయ కార్యక్రమం
Published On: August 29, 2025 2:37 pm
