నిజామాబాద్ జై భారత్ మే:23 నగర పర్యావరణ పరిరక్షణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు “వుమెన్ ఫర్ ట్రీస్” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5 నుంచి కలూరు చెరువు గట్టు వెంట సుమారు 400 మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మొక్కల సంరక్షణ బాధ్యతను స్థానిక మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. చెరువుల సంరక్షణతోపాటు హరిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరు ముందుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.