నిజామాబాద్ జై భారత్ జూన్ 12: (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును బదిలీ చేస్తూ, ఆయనను స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది.నూతన కలెక్టర్‌గా వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. త్వరలోనే ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.జిల్లా ఇంచార్జి మంత్రిగా సీతక్క నిజామాబాద్ జిల్లా ఇంచార్జి గా ఉన్న జూపల్లి కృష్ణ రావు స్థానం లో మంత్రి సీతక్క ను నియమిస్తూ మరో జీవో జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మార్పు – నూతన కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి .
Published On: June 12, 2025 9:43 pm
