నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో గురువారం సాయంత్రం పాల్గొన్నారు.
టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలో గల తన గన్మెన్ అజార్ నివాసంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “ఈ దేశ సంస్కృతి మతసామరస్యంపై ఆధారపడినది. కులమతాలకు అతీతంగా మనం అందరం ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇలాంటి సందర్భాలు అన్నీ మానవీయ విలువలకు ప్రతీకగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్, టౌన్ 5 ఎస్ఐ ఎమ్. గంగాధర్,మరియు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.