సిరికొండ, 2026-08-28
సిరికొండ మండలం పోతునూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మార్వో రవీందర్ రావు, గ్రామ సర్పంచ్ మహిపాల్ యాదవ్, ఉప సర్పంచ్ రాజలింగం, జీపీఓ నవీన్ కలిసి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
సిరికొండ మండలం పోతునూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మార్వో రవీందర్ రావు, గ్రామ సర్పంచ్ మహిపాల్ యాదవ్, ఉప సర్పంచ్ రాజలింగం, జీపీఓ నవీన్ కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో రవీందర్ రావు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారుల వివరాలు డిజిటల్ విధానంలో అందుబాటులో ఉండటం వల్ల రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.











