కామారెడ్డి, 2 August
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇండియన్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ రసాయన శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇండియన్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ రసాయన శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి హాజరై, ఆచార్య ప్రఫుల్ల చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి మీనా, ఆచార్య ప్రఫుల్ల చంద్ర రసాయన శాస్త్రానికి అందించిన సేవలను విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు కూడా రసాయన శాస్త్ర గొప్పదనం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. కెమిస్ట్రీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, రసాయన శాస్త్ర అధ్యాపకురాలు ఝాన్సీ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.










