నవంబర్ మూడవ తేదీన భాగ్యనగరంలోని నాగోల్ శుభం కన్వెన్షన్ లో పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, జాతీయవాదుల కలయిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు ఎం జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎం జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి పరిషత్ లో అనేక దశాబ్దాలుగా పనిచేసి, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్థ సిద్ధాంతాల కోసం యూనివర్సిటీలు, హాస్టళ్లలో నక్సలైట్లు, రాడికల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ, అనేక క్యాంపస్ లను కాషాయీకరణ చేసిన పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒకచోట కలుసుకొని సదస్సు నిర్వహించడం శుభ పరిణామమని ఆయన అన్నారు. కావున, పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఏ స్థాయిలో, ఏ రంగంలో ఉన్నా అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శి మరియు బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, కాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అడ్లూరి శ్రీనివాస్, యెండల సుధాకర్, స్వామి యాదవ్, చైతన్య, బిట్ల రవి, బాలాజీ, వెంకటేష్, శరత్ చంద్రా, నవీన్, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


