గృహ వినియోగదారులకు మరోసారి భారీ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్ పీ జీ సిలిండర్ ధరను రూ.29 పెంచింది.
కొత్త ధరలు జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చిలో కూడా రూ.60 పెరిగిన గ్యాస్ ధరలు, తాజాగా మరోసారి పెరగడంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది.
ఈ పెంపు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. గ్యాస్ ధరల పెరుగుదల, దినసరి ఖర్చులను ప్రభావితం చేస్తూ, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కష్టతరంగా మార్చుతోంది.
ప్రజలలో ఆందోళన నెలకొంది. గతంలోనూ ఈ తరహా పెంపులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించాయి.







