నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రజల కోసం, శ్రమ దోపిడీ లేని వ్యవస్థ కోసం నిండు ప్రాణాలను అర్పించిన అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తూ , వారి ఆశయ సాధనకై ముందుకు సాగుతామని ప్రతిన బూనినట్లు నిజామబాద్ జిల్లా అరుణోదయ అధ్యక్షులు సురేష్బాబు,పి వై ఎల్ ఆర్మూర్ మండల కమిటీ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ తెలిపారు.5 నవంబర్ మంగళవారం రాత్రి జరిగిన అమరవీరుల స్మారక సభ లో అరుణోదయ జిల్లా అధ్యక్షులు సూరిబాబు మాట్లాడుతూ మామిడిపల్లిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, మెరుగైన సమాజం కోసం, పోరాడతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. సామ్రాజ్యవాద వ్యతిరేక నిజమైన దేశభక్తి అని ఆయన అన్నారు.బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పోయిన తరువాత నల్ల దొరలు దేశ ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడారని, ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేయని వ్యవస్థ కోసం, తమ విలువైన ప్రాణాలను సామాజికమార్పుకై అర్పించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ ప్రాంతంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ అనుబంధ ప్రజా సంఘాలలో పనిచేసిన పిట్ల.యెల్లన్న, ఎస్ సుదర్శన్, పర్సగంగాధర్, పిడిఎస్యు అజయ్, రమక్క,మల్లన్న లకు జోహార్లు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నిజామబాద్ జిల్లా పివైఎల్ మాజీ అధ్యక్షులు రవి,మగ్దుమ్ పటేల్,సోయల్, లతీఫ్, వర్ణారెడ్డి, సమీర్, ప్రకాష్, భాష, రంజిత్, కరీం తదితరులు పాల్గొన్నారు.
అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు… న్యూ డెమోక్రసీ నాయకులు వి సురేష్ బాబు
Updated On: November 5, 2024 6:14 pm
