ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం – బస్ బోర్డుల గందరగోళంతో ప్రయాణికులు ఇబ్బంది

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 15 : (షేఖ్ గౌస్) జిల్లా కేంద్ర బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. TS 17 Z 0012 నంబర్‌ గల బస్సుపై గమ్యస్థాన వివరాలు తప్పుగా ప్రదర్శించడంతో నందిపేట్ ప్లాట్‌ఫారం వద్ద అయోమయం నెలకొంది.శనివారం ఉదయం నిజామాబాద్ బస్టాండ్‌లోని నందిపేట్ ప్లాట్‌ఫారం వద్ద ఆగిన ఆ బస్సు వెనుక భాగంలో “నిజామాబాద్ – సికింద్రాబాద్” అని బోర్డు ఉండగా, ముందు భాగంలో మాత్రం “నిజామాబాద్ – నందిపేట్” అని చూపించడం ప్రయాణికులను సందిగ్ధంలోకి నెట్టింది.ఒకే బస్సుపై రెండు వేర్వేరు గమ్యస్థానాలు చూపించడం వల్ల బస్సు నిజంగా ఎక్కడికి వెళుతుందో అర్థం కాక పలువురు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.ప్రజా రవాణాలో స్పష్టమైన సమాచారం అత్యవసరమని, ఈ విధమైన నిర్లక్ష్యం ఆందోళనకరమని ప్రయాణికులు తెలిపారు. గమ్యస్థాన బోర్డులను సరిచేయడం మరియు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment