నిజామాబాద్ జై భారత్ జూన్:4 ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరి పేట కళా నిలయం లో జరిగిన 40 వ జాతీయ స్థాయి నవరస శాస్త్రీయ సంగీత నాట్య కళారూపాల పోటీలలో పాల్గొని 10 సం,, వయసు లోపు కూచిపూడి నృత్య విభాగం లో ” తరంగం ” నృత్య ప్రదర్శన కు గాను “ప్రత్యేక జ్యూరీ నాట్య మయూరి అవార్డ్ ” నిజామాబాద్ జిల్లా వాసి అయిన తేలి విభ శ్రీ సొంతం చేసుకుంది.నగరం లోని కరణం శ్రీనివాస్ నాట్య తరంగిణి కళాశాల లో ప్రత్యేక నృత్యం అభ్యసించింది.తరంగం – ప్లేటు పై నిలబడి తల పై చెంబు తో కృష్ణం కలయ సఖి నృత్యాన్ని చేస్తూ ప్రేక్షకులను అబ్బుర పరుస్తూ కళా నిలయం – చిలకలూరిపేట లో ప్రశంసలు పొందినది.చిన్నారి విభా శ్రీ ఇటు శాస్త్రీయ నృత్యాన్నీ మరియు పాశ్చాత్య నృత్యాన్నీ రెండు కళ ల్ని ప్రోత్స హిస్తున్న తల్లి దండ్రులైనా విజయ్ కుమార్ – ప్రసన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక అభినందనలు తెలిపినారు.
నాట్య మయూరి విభ శ్రీ కూచిపూడి నృత్య కళాకారి నికి-కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందనలు
Published On: June 4, 2025 11:29 pm
