వెంటనే ప్రధానిగా రాజీనామా చేయాలి.ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు.మోదీ దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమంలో పోలీసులు,కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.వెంటనే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు.విజయవంతంగా కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా కేశ వేణుమాట్లాడుతూ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఎలక్షన్ కమిషన్ ను తన ఆధీనంలో పెట్టుకొని దేశంలో ఎన్నోవేల ఓట్లు దొంగతనం గా సృష్టించి మోడీ అధికారంలోకి వచ్చాడని, అంతేగాని ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదని,దేశానికి నైతికంగా మోడీ ప్రధాని కాదని కేశ వేణు అన్నారు.రాహుల్ గాంధీ మోడీ చేసిన దొంగ ఓట్ల ప్రక్రియనుబయటపెడితే బీజేపీ నాయకులు ఏం చేయలో అర్థం కాక రాహుల్ గాంధీ పై అవాక్కులు, చవాకులు పేలుస్తున్నారని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని, నిజమైన నాయకులుఎవరు స్వార్థాల కొరకు వ్యవస్థలను వాడుకుంటున్నారో గమనించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామ కృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి,వివిధ ఆలయాల చైర్మన్ లు లవంగ ప్రమోద్, మధు సుధాన్,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ కృష్ణ,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.











