వక్ఫ్ భూముల అమ్మకానికి కేంద్రం కుట్ర: ముస్లిం మహిళా నేతలు

వక్ఫ్ రక్షణలో మేము సైతం” అంటూ నిజామాబాద్‌లో ముస్లిం మహిళల భారీ నిరసన సభ.

నిజామాబాద్ జై భారత్ మే:28 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త వక్ఫ్ బిల్లుపై ముస్లిం మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ భూములను ప్రైవేటీకరణ దిశగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, బుధవారం రాత్రి నిజామాబాద్ బోధన్ రోడ్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో భారీ నిరసన సభను నిర్వహించారు.ఈ సభకు ప్రొఫెసర్ ఖుద్సియా, జలీ సుల్తానా (వక్ఫ్ & కాంస్టిట్యూషన్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్), తెలంగాణ వక్ఫ్ బోర్డు సభ్యురాలు నాసిరా ఖానం ముఖ్య వక్తలుగా హాజరయ్యారు.వక్తలు మాట్లాడుతూ 

వక్ఫ్ చట్టాల్లో మార్పులు ముస్లింల రాజ్యాంగ హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని,వక్ఫ్ భూములపై కలెక్టర్లకు అధికారం ఇవ్వడం వక్ఫ్ బోర్డు అధికారాన్ని కాలరాయడమేనని,కార్పొరేట్ కంపెనీలకు మార్గం వేసే ఈ విధానం సామూహిక ఆస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తీవ్రంగా విమర్శించారు.”వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి చెందినవే. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ముస్లింలందరిపై ఉంది” అని స్పష్టం చేశారు. “కేంద్రం తెర వెనుక అజెండా అమలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టేందుకు సమూహిక పోరాటమే మార్గం” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.“వక్ఫ్ రక్షణలో మేము సైతం” అంటూ పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. వక్తల ప్రసంగాలకు కరతాళ ధ్వనులతో మద్దతు తెలిపి, తమ ఆవేదనను వెల్లడించారు.ఇది వక్ఫ్ భూములకు సంబంధించిన మతం, న్యాయం, రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుగా ముస్లిం మహిళలు చేపట్టిన సమిష్టి విప్లవం అని వక్తలు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!