నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6.
ఈరోజు నగరంలో 12వ వార్డులో జవాన్ ఇర్ఫాన్ ను స్థానికులు మురికి కాలువలు శుభ్రపరచమని తెలుపగా ఆడవారు అని చూడకుండా సైతం వాళ్ళ ముందు అసభ్యకరమైన మాటలు మాట్లాడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నాము ఇర్ఫాన్ పనిచేయాల్సింది కాకుండా టిడిపి పార్టీ అని చెప్తే పార్టీ వాళ్ళు ఏం చేస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు అందుకోసం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ను మేము విన్న వించ్చుకుంటున్నాము ఇర్ఫాన్ మీద చర్యలు తీసుకోవాలని టీ డీ పీ పార్టీ తరఫున కోరుకుంటున్నామనీ స్టేట్ జర్నల్ సెక్రెటరీ ఫెరోజ్ ఖాన్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సరిగ్గా చెత్త సేకరించడానికి కూడా వాహనాలు రావడంలేదని మురికి కాలువలు శుభ్రపరుస్తాలేరని దోమల నివారణ కోసం డిడిటి వాడుతలేరని స్థానికులు వాపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు 12వ వార్డు సమస్యల్ని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.