నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9.(షేక్ గౌస్)
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇటీవల చేస్తున్న ఆరోపణలపై జిల్లా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పసుపు ధరలు పడిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను మళ్లించేందుకు అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.జవహర్ నవోదయ స్కూల్ అంశాన్ని ముందుకు తెచ్చి, దానిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని అరవింద్ యత్నిస్తున్నాడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. సుదర్శన్ రెడ్డి తమ నియోజకవర్గానికి నవోదయ స్కూల్ రావాలని అభిప్రాయపడితే, ఏమి తప్పు ? అని ప్రశ్నింారు .ఏం పి కు ప్రజా సమస్యలపై ఆసక్తి వుంటే , కాంగ్రెస్ ఎమ్మెల్యేల తో చర్చించి పరిష్కారం కనుగొనాలి కదా? అని క్వశ్చన్ చేశారు.పసుపు రైతుల వ్యథను పక్కదారి పట్టించేందుకు, జవహర్ నవోదయ అంశాన్ని లేపడని , నిజామాబాద్ అభివృద్ధి కోసం పార్లమెంటులో ఓ మాట చెప్పగలరా?” అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. “అబద్ధపు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే, భవిష్యత్తులో ప్రజలు అదే తీరుగా సమాధానం చెప్తారు” అని హెచ్చరించారు.