నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్)
నిజామాబాద్ లో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం నిజామాబాద్ పట్టణంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పండితుల సభలో ప్రత్యేక అతిథిగా.రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (RUPP-TG) సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న షబ్బీర్ అలీ మాట్లాడుతూ, భాషా పండితుల 30 ఏళ్ల కోరికను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఉద్యోగులకు నెల ప్రారంభానే జీతాల పంపిణీ, రాష్ట్రంలో ఇప్పటి వరకు 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం విద్యావ్యవస్థ పటిష్టత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.
కురుమ సంఘ కమ్యూనిటీ హాల్ ప్రారంభం.
పట్టణంలోని పులాంగ్ రోడ్డులో కొత్తగా నిర్మించిన కురుమ సంఘ కమ్యూనిటీ హాల్‌ను షబ్బీర్ అలీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, తాహర్ బిన్ హంధాన్, గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవ వేణు, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
దళిత కుటుంబంతో కలసి భోజనం .