నగరంలో ఛాతి, అలర్జీ వ్యాధులకు ఆధునిక వైద్య సేవలు

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలో ఛాతీ సంబంధిత వ్యాధులు, అలర్జీ సమస్యలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు డా. కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ ను గురువారం ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో సేవలందిస్తున్న అనుభవజ్ఞులైన పల్మనాలజిస్ట్ డా. బి. కిషోర్ రెడ్డి ఈ క్లినిక్ ద్వారా దమ్ము, ఆస్థమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, జ్వరం, శ్వాసకోశ సమస్యలు వంటి వ్యాధులకు సమగ్ర చికిత్సలు అందించనున్నారు. క్లినిక్ పిఎఫ్ టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), బ్రాంకో స్కోపీ, థొరాకో స్కోపీ, గురక పరీక్ష వంటి అత్యాధునిక వైద్య పరీక్షల సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. డా. కిషోర్ 8 (ఎం బి బి ఎస్, ఎండీ పల్మనాలజీ, ఈసీసీపీ) ఛాతీ వైద్య నిపుణుడిగా, క్రిటికల్ కేర్ స్పెషలిస్టుగా రోగులకు వ్యక్తిగత శ్రద్ధతో నాణ్యమైన చికిత్సలు అందించడం ఈ క్లినిక్ ప్రత్యేకతగా పేర్కొన్నారు. అపాయింట్మెంట్ల కోసం 08462-223838, 9912787920, 9676453939 నంబర్లను సంప్రదించాలని క్లినిక్ నిర్వాహకులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment