చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18.

ఈరోజు నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పాల్గొన్నారు.మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేప పిల్లల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు.దళారులు ఒక మాఫియాలాగా ఏర్పడి మత్స్యకారుల కష్టాన్ని దోచుకుంటున్నారని అన్నారు.అధికారులు చొరవ చూపి మత్స్యకారులకు లైసెన్స్ ఇవ్వడం వల్ల దళారులకు చెక్ పెట్టొచ్చని అన్నారు.మత్స్యకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు..అదేవిధంగా నిజాంసాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు,మత్స్యశాఖ అధికారులు,మత్స్యకార నాయకులు , స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!