ప్రజలకు మెరుగైన సేవలందించాలి: మంత్రి జూపల్లి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :16

ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం జరిగిన జిల్లా స్థాయి సమీక్షలో ఆయన పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.తాగునీటి సరఫరా, సన్న బియ్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించరు. బోరుబావులు అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హులైన వారినే ఎంపిక చేయాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేని పేదలకు మహిళా సంఘాల సహకారంతో ఇళ్లు నిర్మించి, బిల్లులు వాటికి చెల్లించాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు, తూకాలు, రసీదుల విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment