అప్పుల భారం ఉన్నా … వాగ్దానాలను అమలు చేస్తున్నాం… మంత్రి జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :16 ( షేక్ గౌస్)
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ.
జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వ అసంబద్ధ పాలన కారణంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. అయినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని అన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో పంపిణీ చేశారు.
ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రూ. 8 లక్షల కోట్ల అప్పుల పై ప్రతీ నెల 6 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చిందని చెప్పారు. అప్పుల భారంతో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం అందించలేని పరిస్థితి ఉందని చెప్పారు. అయినప్పటికీ, వారి హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.మంత్రిపై 21 వేల కోట్ల రూపాయలు వెచ్చించి, రైతులకు రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాలు మాఫీ చేశామని తెలిపారు.
మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన
జూపల్లి కృష్ణారావు బుధవారం ఆర్మూర్ పట్టణంలో రూ. 3 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment