గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలి…మాజీ మంత్రి,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద ర్శన్ రెడ్డి

కుర్నాపల్లిలో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు..

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : గ్రామీణ ప్రాంతాలలోనీ పేద ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సకాలంలో వైద్య సేవలు అందించాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎడపల్లి మండల కుర్నాపల్లి గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఆరోగ్యఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించా రు.గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.ప్రతిరోజు వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండి సమయ పాలన పాటించాలని సూచించారు.వైద్యారోగ్య సమ స్యల పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన తాము ఉపేక్షించ బోమని అన్నారు.ప్రభుత్వం అన్ని వస్తువులు సమకూ ర్చినప్పుడు విధుల్లో అలసత్వం ప్రదర్శించరాదని అన్నారు. అనంతరం అంగన్ వాడి కేంద్ర భవన నిర్మా ణానికి ఆయన భూమి పూజ చేశారు.అనంతరం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూ రు పత్రాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేద లబ్ధిదారు లకు అందజేశారు.పేదలు ఇంటినీ నిర్మించు కునేందుకు ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూ రు చేయడంజరుగుతుంది అని అన్నారు.పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గ్రామాలలో సమస్యలుపరిష్కారానికి అన్ని చర్యలుచేపడుతున్నామని,అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నామని అయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేశామని, మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని,చేసి చూపి స్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజి రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్,ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం, నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, సొసైటీ వైస్ వైస్ చైర్మన్ గాంధారి అనీల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కోండ్ర సంజయ్, ఎజాజ్, రాజా గౌడ్, అమానుల్లాషరీఫ్,కాజా,శంకర్ నాయుడు, బుడ్డ పోశెట్టి, కిషన్ గౌడ్, బంజ కామప్ప, దొడ్డి శ్రీనివాస్,తాహేర్,కోండ్ర పాండు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment