రెండో విడత ఎన్నికల కోసం మద్యం దుకాణాలు బంద్.

జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో డిసెంబర్ 12 : నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివెసినట్టు నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికల జరిగే నిజామాబాద్ సౌత్ మండలం, నిజామాబాద్ నార్త్ మండలం, నిజామాబాద్ రూరల్ మండలం, ధర్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికోండ, జక్రాన్ పల్లి మండలాల పరిధిలోని మద్యం దుకాణాలను శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మూసివెసినట్టు తెలిపారు. ఈ నెల 15న ఉదయం మూసివేసిన దుకాణాలు తెరుస్తారని తెలిపారు. అదే విధంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ఆర్మూర్, భీంగల్ మండలంలోని పంచాతీయ ఎన్నికలు కోసం రెండు బల్దియా ప్రాంతాలలోని లిక్కర్ షాపులు ఈ నెల 15 సాయంత్రం 5 గంటల నుంచి మూసివేస్తామని తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే అలూర్, బాల్కోండ, డోంకేశ్వర్, కమ్మర్ పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఎర్గట్ల మండలాల్లో 15న సాయంత్రం నుంచి 17 వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు ఆబ్కారీ శాఖ ఇఎస్ మల్లారెడ్డి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment