LG (Lucky Generals) ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్.

150 మంది ఇట్టి కంపెనీ యందు పెట్టుబడి వాటి విలువ దాదాపు 75 లక్షలు ఉంటుందని అంచనా.

మోసపూరిత యాప్ నందు ప్రజలు ఆకర్షితులు కాకూడదని పోలీస్ కమిషనర్ వెల్లడి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 24 : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన దరఖాస్తు ఏమనగా సుమారు మూడు నెలల క్రితం నిజామాబాద్ వివి నగర్ కాలనీ ముబారక్ నగర్ కు చెందిన మేకల జగదీష్ మరియు పెద్ద బోయిన భూమయ్య అలియాస్ ప్రేమ్ సాటాపూర్ కు చెందిన వ్యక్తి ద్వారా LG India కు సంబంధించిన App నందు 25,500 జమ చేయగా ఇట్టి ఎల్జి ఇండియా సంబంధించిన వీడియోలు రోజుకి 16 చొప్పున చూస్తే ప్రతి వీడియోకు 55 రూపాయలు వస్తాయని అలా రోజు దాదాపు 880 సంపాదించవచ్చు అని నమ్మించి ఇట్టి కంపెనీకి డబ్బులు పెడితే కంపెనీ యాడ్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని అలాగే ఇట్టి కంపెనీ నందు తాను లీడర్ గా మారి ఇతరులను జాయిన్ చేస్తే దానికి గాను అదనంగా 8 మందికి 4000 చొప్పున 15 మందికి 8000 చొప్పున డబ్బులు వస్తాయని నమ్మించగా అట్టి ఫిర్యాదుదారుడు LG India యాప్ లో డబ్బులు పెట్టినాడు, అదేవిధంగా ఇట్టి ఏజెంట్ల మాయమాటలు నమ్మి అతను గాకుండా అతని రక్త సంబంధులకు మరియు తెలిసిన వ్యక్తులకు ఇట్టి ఎల్జీ కంపెనీ నందు పెట్టుబడి పెట్టించినాడు. మొదట్లో ఇట్టి ఆప్ నందు డబ్బులు వస్తున్నట్లు LG వాలెట్లో జమ ఐతున్నట్లు కనిపించినవి. ఇట్టి దానిని నమ్మి ప్రేమ్ మరియు మేకల జగదీష్ దాదాపు 150 మంది వ్యక్తులను నమ్మించి ఇట్టి ఎల్జీ కంపెనీ నందు డబ్బులు పెట్టించినారు. వాలెట్లో ఉన్న డబ్బులు తమ సొంత ఖాతాలకు మార్చుకొని డబ్బులు వస్తాయని అనుకొనగా అట్టి అకౌంట్లు యందు జమ అయినటువంటి ఫేక్ అమౌంట్ విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా అవి విత్ డ్రా కాలేదు అట్టి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయబడినవి అని తెలుసుకొని తను మోసపోవడమే కాకుండా ఇతరులు కూడా మోసపోయారని తెలుసుకొని ఇట్టి ఎల్జి కంపెనీ ఏజెంట్లని అడగగా ఇట్టి కంపెనీ ఆపరేట్ ముంబైలో జరుగుతుందని కంపెనీ చీఫ్ రాజు అని చెప్పి మాట్లాడుతున్నాం మీ డబ్బులు మీకు వస్తాయని కొంతకాలం నమ్మించినారు తర్వాత అతను మోసపోయానని తెలిసుకొని రెంజల్ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.ఈ విధంగా నిందితులు దాదాపు గా 150 మంది సాటాపూర్ గ్రామస్తులను మోసం చేసినట్టు తెలిసింది. ఇట్టి ఎల్జీ కంపెనీ నందు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బు విలువ సుమారు 75 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం ప్రస్తుతం ఇట్టి LG ( Lucky Generals) కంపెనీకి చెందిన యాప్ పనిచేయడం లేదు.కావున ఈ సందర్భంగా  పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్. విలేకరుల సమావేశంలో  ప్రజలందరికీ తెలియజేస్తూ   ఎవరు కూడా ఇలాంటి మోసపురితమైనటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం యందు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు పొందాలని ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టకూడదని, పెట్టి మోసపోకూడదని ఇలాంటి మోసపూరిత మాటలకు ఆకర్షితులు కావద్దని, ఎవరైనా ఇట్టి కంపెనీ పేరులతో పెట్టుబడి పెట్టాలని చెబితే లోకల్ పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము.ఈ రోజు ఏజెంట్లైన మేకల జగదీష్ ,  అదేవిధంగా పెద్ద బోయిన భూమయ్య అలియాస్ ప్రేమ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని అదేవిధంగా ముంబైకి చెందిన రాజు అనే వ్యక్తిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment