తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 22.
వ్యవసాయ మార్కెట్ కమిటీ పిట్లం పరిధిలో ఉన్న మహమ్మద్ నగర్ మండలంలో 50,000 MTS నాబార్డ్ గోదాం మరియు వ్యవసాయ మార్కెటింగ్ శిక్షణ కేంద్రం నిర్మించుటకు 15 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించుట గురించి. ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ గారికి వినతి పత్రం అందజేసిన, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ మరియు నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , మహమ్మద్ నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి .