నిజామాబాద్ జై భారత్ జూన్ 12 : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిడబ్ల్యుజె) జిల్లా ప్రతినిధులు జిల్లా విద్యాధికారి (డీఈఓ) అశోక్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా టిడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవయ్య, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవెయ్యడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకం. వారు ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తెలియజేసే వేదికగా నిలుస్తున్నారు” అని పేర్కొన్నారు.తక్కువ వేతనాలతో కుటుంబాలను నడుపుతున్న జర్నలిస్టులకు ఈ రాయితీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. గతంలో విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడినప్పటికీ, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు వాటిని అమలు చేయకపోవడాన్ని డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. వినతిపత్రాన్ని స్వీకరించిన డీఈఓ అశోక్ స్పందిస్తూ, “రాయితీ అమలు విషయంలో తగిన చర్యలు తీసుకుంటాం. పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది” అని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో భాస్కర్, పరమేశ్వర్, మధు, కృష్ణ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి టిడబ్ల్యుజె ప్రతినిధుల వినతిపత్రం.
Published On: June 12, 2025 9:35 pm
