తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ శుక్రవారం నవంబర్ 22.
నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో భాగంగా నిజామాబాద్ లో జరిగే ప్రదర్శనను జయప్రదం చేయాలని కార్మిక లోకానికి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న మరియు దాసులు విజ్ఞప్తి చేశారు .నిజామాబాద్ నగరంలోని కోటగల్లి లో నీలం రామచంద్రయ్య భవన్లో 22 నవంబర్ తేదీన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు & భూమన్న లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలన ఎన్నికల వాగ్దానాలు విస్మరించి, అన్నదాత రైతన్నకు, సంపద సృష్టికర్త కార్మిక వర్గానికి మరణ శాసనం లిఖించాడని వారు అన్నారు. ఉపాధి భద్రత అంటూ ప్రగల్బాలు పలికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలని బహిరంగంగా అమ్మేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన ధరకు గిట్టుబాటు ధర లేదు కానీ, నిత్యవసర సరుకుల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని వారు తెలిపారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాడు 50 లక్షల కోట్ల అప్పు ఉంటే నేడు 175 లక్షల కోట్లకు పెరిగిందని వారు అన్నారు. ప్రతి భారతీయ పౌరుడు పై లక్ష ఇరవై ఐదువేల రూపాయలు అప్పు రుద్దిండని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి, తీవ్రవాద నిర్మూలన అంటూ ఉపన్యాసాలు దంచి, నేడు నల్లధనాన్ని పెంచి, కార్పోరేట్ కనుసన్నుల్లో పాలన కొనసాగిస్తున్నాడని వారు ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బడా పారిశ్రామికవేత్తల ముసుగులో ప్రజా సంపదను కొల్లగొడుతున్న వారికి మోడీ అండగా నిలుస్తున్నారని ఈ తొమ్మిది సంవత్సరాల్లో బిజెపి 13 లక్షల 86 వేల రూపాయలు పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ ప్రకటించి, కార్మికుల కనీస వేతనం అమలు చేయకపోవడం దుర్మార్గమని వారు అన్నారు.దేశ సంపద లో 40 శాతం సంపద ఒక్క శాతం మంది చేతిలో కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ప్రజలపై పన్నుల భారం, కార్పొరేట్లకు భారీ నజరాణాలు ప్రకటించి, కార్మిక , కర్షకులకు కన్నీళ్లు మిగిల్చిన మోడీని చరిత్ర క్షమించదని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోని 191 దేశాల జాబితాలో భారత దేశ పరిస్థితి ఆకలిలో107, పర్యావరణంలో 180 స్థానంలో ఉండడానికి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను, వ్యవసాయ వ్యతిరేక మూడు నల్ల చట్టాలను మోడీ సర్కార్ వెంటనే ఉపసంహరించుకోవాలని దాసు డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు నిధుల కోత విధిస్తూ, ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టివేస్తూ, మత భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని వారన్నారు. కార్మిక వర్గం ఐక్యంగా మోడీ కుట్రల్లి ఓడించాలని, 2024 నవంబర్ 26 న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని దాసు, భూమన్నలు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, జెల్లామురళి, కార్యదర్శులు శివకుమార్, జెపి గంగాధర్ . కోశాధికారి దాల్మల్కి పోశెట్టి, నాయకులు మోహన్, భారతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.