డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్షా మరియు 14 మందికి జరిమానా

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ శుక్రవారం నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ముందర హాజరుపరచగా 14 మందికి21,000/- విధించినారు. జైలు శిక్ష విధించిన వారి వివరాలు ఆకుల రాజశేఖర్ తండ్రి బాల్రెడ్డి వయసు 31 సంవత్సరం నివాసము దుబ్బ అను వ్యక్తికి ఒకరోజు,రాంపాల్ తండ్రి శుక్రం వయసు 30 సంవత్సరాలు నివాసము మహారాష్ట్ర, మరియు సయ్యద్ షేబాష్ తండ్రి ముస్తాక్ వయసు 20 సంవత్సరాలు నివాసము చంద్రశేఖర్ కాలనీ అను వ్యక్తులకు రెండు రోజులు జైలు శిక్ష చాకలి రాజు తండ్రి పెంటయ్య వయసు 32 సంవత్సరాలు నివాసం గొల్లపల్లి అను వ్యక్తికి నాలుగు రోజులు జైలు శిక్ష విధించడమైనది.

Join WhatsApp

Join Now

Leave a Comment