నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 16.
2వ జాతీయ డెంటల్ కన్వెన్షన్ నిజామాబాద్ మేఘనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్‌లో నిర్వహించా బడిన ఫ్యాషన్ షోలో ఇర్ఫాన్ వూషూ అంతర్జాతీయ క్రీడాకారుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ..ఫ్యాషన్ షో హోస్ట్‌గా సెలబ్రిటీగా వ్యవహరించడం నాకు గొప్ప అనుభవం. ఈ ఈవెంట్ ఫ్యాషన్ మరియు సృజనాత్మకతకు గొప్ప వేడుక. ఇందులో నేను అందుకున్న గౌరవం మరియు ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ ఎం. ప్రతాప్ కుమార్, ప్రధాన పోషకుడు డాక్టర్ ఎం. ప్రతాప్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలుపుతూ ఫ్యాషన్ అంటే స్టైల్ కాదు, ఇది ఒక ఉత్సాహం మరియు వ్యక్తిత్వంతో కూడి ఉంటుంది అని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన సందర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు.